Bomb threat : కేరళ (Kerala) లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు (Bomb threat) ఈ-మెయిల్ వచ్చింది. ఎయిర్‌పోర్టును బాంబులతో పేల్చివేయబోతున్నామని ఇవాళ ఉదయం ఓ ఆగంతకుడు ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్‌కు మెయిల్ పంపించాడు. దాంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తయ్యారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించి ఎయిర్‌పోర్టు అంతటా అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.
#WATCH | Thiruvananthapuram, Kerala | Security check is underway at the Thiruvananthapuram International Airport, where a bomb threat was received through an email earlier today https://t.co/d2WZW5a3Ms pic.twitter.com/09AbBxSwjw
— ANI (@ANI) April 27, 2025