బీహార్‌లో వారం వ్యవధిలో మూడో వంతెన కూలడం ఆందోళన కలిగిస్తున్నది. తూర్పు చంపారన్‌లో నిర్మాణంలో ఉన్న 16 మీటర్ల వంతెన ఆదివారం కుప్పకూలింది.
మోతిహారి బ్లాక్‌లో ఘోరసహాన్లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. ఆమ్వా అనే గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు కలుపుతూ కెనాల్‌పై ఈ బ్రిడ్జ్‌ను రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మిస్తున్నది.