Watch: కారులో గుడికి వెళ్లి… దేవుడ్ని ప్రార్థించిన తర్వాత హుండీ చోరీ
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీ జరిగిందని పోలీసులు చెప్పారు.
భోపాల్: ఒక దొంగ ఎంచక్కా దర్జాగా కారులో గుడికి వెళ్లాడు. దేవుడ్ని ప్రార్థించిన తర్వాత అక్కడి హుండీని దొంగిలించాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం జనమంతా దీపావళి సందడిలో ఉండగా ఒక దొంగ తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గౌర్ చౌకీలోని హనుమాన్ దేవాలయానికి కారులో వెళ్లాడు. గుడి బయట చెప్పులు వదిలిపెట్టి లోనికి వెళ్లాడు. దేవుడికి దండం పెట్టి ప్రార్థన చేశాడు. అనంతరం గుడిలోని హుండీని చోరీ చేశాడు.
కాగా, గుడిలోని సీసీటీవీలో ఇదంతా రికార్డు అయ్యింది. దీంతో హుండీ చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా ఇదే జిల్లాలో ఇలాంటి తరహా చోరీ జరిగిందని పోలీసులు చెప్పారు. మరోవైపు కారులో గుడికి వెళ్లి దర్జాగా హుండీ చోరీ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Watch: Thief Drives Car To Temple, Prays Before Stealing Donation Box pic.twitter.com/y9XNqd7MJ1
— NDTV (@ndtv) October 26, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Donation Box
- Temple
- thief
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

