పాట్నా: కొందరు వ్యక్తులు పెళ్లికి హాజరయ్యారు. మద్యం సేవించి డ్యాన్సులు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లిలో మద్యం సేవించిన సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Wedding People Arrested) బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెళ్లికుమారుడితో కలిసి పెళ్లి బృందం ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నది. అయితే పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న సుమారు 40 మంది వ్యక్తులు మద్యం సేవించారు. కొందరు నాగిని డ్యాన్సు చేశారు. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చే తమ బంధువుల కోసం మద్యం బాటిల్స్ తీసుకువచ్చారు.
కాగా, బీహార్‌లో మద్యంపై నిషేధం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి బృందం మద్యం సేవించినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో వరుడి తరుఫు వారైన 40 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారికి మద్యం అమ్మిన ఏడుగురు లిక్కర్ వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు. మద్యం బాటిల్స్‌తో పాటు రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.