UP Govt | 48 మంది మంత్రులతో యోగి ప్రమాణం..
లక్నో : ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం కొలువుదీరనున్నది. గురువారం ఆ రాష్ట్ర శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. అయితే, అంతకు ముందే మంత్రుల జాబితాపై జాతీయ స్థాయి నేతలు కూలంకశంగా చర్చిస్తుస్తున్నారు. దాదాపు 48 మంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేబినెట్లో అన్నివర్గాలకు, ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించేందుకు కసరత్తులు చేస్తున్నారు. దాదాపు 60 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేయగా.. పూర్తిస్థాయిలో జాబితా ఖరారు చేయాల్సిన ఉందని పార్టీ వర్గాలు పేర్కొ్న్నాయి.
డిప్యూటీ సీఎం మౌర్యకు సైతం మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. సీరతు స్థానం నుంచి ఓటమిపాలైన మౌర్యకు మళ్లీ పాత బాధ్యతలు అప్పగించేందుకు సూత్రప్రాయంగా అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది మంత్రులు ఓటిపాలయ్యారు. ఎన్నికలకు ముందు ముగ్గురు మంత్రులు ఎన్నికలకు ముందు పార్టీ మారారు. ఓడిపోయిన వారిలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఇండిపెండెంట్, ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఇందులో కేవలం మౌర్యను మాత్రమే తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.
ఓటమిపాలైన మంత్రులు కేశవ ప్రసాద్ మౌర్య (సీరతు), రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్ (చిత్రకూట్), ఆనంద్ స్వరూప్ శుక్లా (బల్లియాలోని బైరియా), ఉపేంద్ర తివారీ (ఫెఫ్నా), సతీష్ చంద్ర ద్వివేదీ, లఖన్ సింగ్ రాజ్పుత్, సంగీతా బల్వంత్, రణవేంద్ర సింగ్ ధున్నీ, ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ, ధారాసింగ్ చౌహాన్ బీజేపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. వీరిలో స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ ఓటమిపాలవగా.. ధారాసింగ్ చౌహాన్ విజయం సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

