న్యూఢిల్లీ : భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఆదివారంతో ముగిసినట్టు వచ్చిన వార్తలను భారత సైన్యం ఖండించింది. కాల్పుల విరమణకు ముగింపు తేదీ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 12న ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ కీలక చర్చలు జరిపి వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు.
సరిహద్దుల్లో భద్రతా దళాలను తగ్గించుకోవడానికి పరస్పరం అంగీకరించారు.