రాంచీ : జార్ఖండ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. 14 లోక్సభ స్థానాలున్న జార్ఖండ్లో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనున్నది. రాష్ట్రంలో మొత్తం 2.56 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇండియా కూటమి నుంచి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మొత్తం 12 మంది లోక్సభ ఎన్నికల బరిలో నిలబడ్డారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్.. ‘ఇండియా కూటమి’గా ఏర్పడ్డాయి. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను జేఎంఎం బరిలోకి దింపింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి శీతాకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.