న్యూఢిల్లీ: యువత వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పి, చర్చకు తెర తీసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా తన పనితీరు గురించి వివరించారు. వారానికి ఆరు రోజులు పని చేసిన కాలంలో తాను రోజుకు కనీసం 14 గంటలపాటు పని చేసేవాడినని తెలిపారు. ఇన్ఫోసిస్‌ను ఏర్పాటు చేసేటపుడు ఉదయం 6.20 గంటలకు కార్యాలయానికి చేరుకుని, రాత్రి 8.30 గంటల వరకు పని చేసేవాడినన్నారు. 1994 వరకు వారానికి ఆరు రోజులు పని దినాలు ఉండేవని, అప్పట్లో తాను వారానికి కనీసం 85 నుంచి 90 గంటలు పని చేసేవాడినన్నారు. ‘ఇది నా దేశం, నేను వారానికి 70 గంటలు పని చేస్తాను’ అని చెప్పాలని మన దేశ యువతను కోరారు.