న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో గ్యాస్, పెట్రో కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్ల కోసం ఎలాంటి చిరునామా రుజువు పత్రం లేకుం డా తీసుకెళ్లవచ్చని వెల్లడించింది.
స్థానిక కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 23 నుంచి ఇప్పటి వరకు సుమారు 5.7లక్షల సిలిండర్లను అడ్రస్ ఫ్రూఫ్ లేకుం డా విక్రయించినట్టు పేర్కొన్నది.