Tamil Nadu | చెన్నై, జూలై 25: అన్నంలోకి ఊరగాయ ఇవ్వలేదన్న కారణంతో తమిళనాడు వాసి ఒకరు ఒక హోటల్‌పై రెండేళ్లు వినియోగదారుల కమిషన్‌లో పోరాడి విజయం సాధించాడు. అన్నంలో ఊరగాయ వేయకపోవడం సేవల్లో లోపమని పేర్కొంటూ రెస్టారెంట్‌కు కమిషన్ రూ.35,025 జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి 25 భోజనాలు ఖరీదుచేశాడు. అయితే భోజనంలో ఊరగాయ లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి రెండేళ్ల పాటు పోరాడాడు. భోజనంలో ఊరగాయ మర్చిపోయినందుకు ఆ హోటల్ యజమానికి కమిషన్ 35 వేల జరిమానా విధించింది. అంతేకాకుండా ఖర్చుల కోసం 5 వేలు, ఊరగాయల ప్యాకెట్లకు మొత్తం రూ.25 ఇవ్వాలని ఆదేశించింది.