న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక శాఖ 76 లక్షల రూపాయల నిధులు వెచ్చించింది. సహ చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రింట్ మీడియా సంస్థలకు ప్రకటనలు ఇచ్చేందుకు ఆ శాఖ ఈ మొత్తాన్ని ఖర్చు చేసింది.
సామాజిక కార్యకర్త అజయ్ బాసుదేవ్ సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ఈ నెల 13న పొందారు. దీనిపై సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ వివరణ ఇచ్చారు. నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ గుర్తించిన సంస్థల వార్షికోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించడం మామూలేనని చెప్పారు.