Minister Ashwini Vaishnav | 10 వేల కోట్లతో విజ్ఞాన్ ధార.. బయో ఈ3 పాలసీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం: మంత్రి అశ్వినీ వైష్ణవ్
విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది.
Minister Ashwini Vaishnav | న్యూఢిల్లీ, ఆగస్టు 24: విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, యూజీ, పీజీ, పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్లు అందించనుంది.
అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఆర్థిక, పర్యావరణ, ఉపాధి కోసం జీవసాంకేతిక విజ్ఞానం(బయో ఈ3) విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ ఇంధన, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ, పరిశోధన, ఈ రంగంలోని నూతన సాంకేతికత ప్రోత్సాహానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

