న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వేసిన చలాన్ల మొత్తం రూ. 12 వేల కోట్లుగా ప్రముఖ ఆటోటెక్ సంస్థ కార్స్ 24 సోమవారం పేర్కొంది. ఇందులో రూ. 9 వేల కోట్లు వినియోగదారులు చెల్లించలేదని తెలిపింది. 2024లో మొత్తంగా 8 కోట్ల చలాన్లు జారీ అయ్యాయని, ప్రతి రెండింటిలో ఒక వాహనానికి ఈ జరిమానా పడినట్టు పేర్కొంది.
ముఖ్యంగా గురుగ్రాంలో రోజుకు 4500 చలాన్లు విధించినట్టు నివేదికలో వివరించింది. దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తున్నారో ఇది తెలియజేస్తున్నదని ప్రస్తావించింది.