న్యూఢిల్లీ: అత్యవసర కేసులపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక సెలవుల ధర్మాసనం సోమవారం(ఈనెల 22 ) సమావేశమవు తుందని సీజేఐ సూర్యకాంత్ శుక్రవారం కోర్టులో తెలిపారు. శుక్రవారం నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు.
అత్యవసర కేసులపై విచారణ కోరేవారు సోమవారం తమ వాదనను వెకేషన్ సిట్టింగ్లో వినిపించవచ్చని సీజేఐ సూచించారు. ఫైళ్లను చదవడంలో తీవ్రంగా అలసిపోయిన న్యాయమూర్తులు ఈ రోజు అత్యవసర కేసులపై విచారణ జరిపే స్థితిలో లేరని ఆయన చెప్పారు.