న్యూఢిల్లీ, మే 19: జ్ఞానవాపి మసీదులో ఇటీవల బయల్పడిన నిర్మాణానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వే నిర్వహణకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జరిగే వరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్రానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
బయల్పడిన నిర్మాణం వయస్సును కనుగొనేందుకు ప్రత్యామ్నాయ సాంకేతికతను కనుగొనేందుకు ప్రయత్నిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలిపారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఈ విషయంలో సంప్రదించవచ్చని సుప్రీం సూచించింది.