న్యూఢిల్లీ, ఆగస్టు 26: న్యాయవ్యవస్థలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులకు కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణ పూర్తయి తమ తీర్పులను వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తులకు తీర్పులు వెలువరించడానికి 3 నెలల గడువును సుప్రీంకోర్టు నిర్దేశించింది. మూడు నెలల్లోగా రిజర్వ్‌లో ఉంచిన తీర్పులను వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైకోర్టు న్యాయమూర్తులు నెలల తరబడి తీర్పులను వాయిదాలో ఉంచడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జాప్యం కక్షిదారులలో అస్థిరతను, ఆవేదనను మిగులుస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.