న్యూఢిల్లీ: ఓ గుడిలోని దేవుడికి సంబంధించిన డిపాజిట్ డబ్బును ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార బ్యాంకులను ఆదుకోవడానికి ఉపయోగించకూడదని శుక్రవారం సుప్రీంకోర్ట్ ఆదేశించింది. తిరునెల్లి దేవస్థానం డిపాజిట్ సొమ్మును దేవస్థానం బోర్డ్‌కు రెండు నెలల్లో వెనక్కి ఇవ్వాలన్న కేరళ హైకోర్ట్ ఆదేశాన్ని కొన్ని సహకార బ్యాంకులు సుప్రీం కోర్ట్‌లో సవాల్ చేశాయి.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. దేవుడి డబ్బు కేవలం దేవాలయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.