న్యూఢిల్లీ, మే 18: జ్ఞానవాపి మసీదులోని శివలింగంగా పేర్కొంటున్న నిర్మాణంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు మేనేజ్మెంట్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మసీదులో గత ఏడాది చేపట్టిన సర్వేలో బయటపడిన నిర్మాణం శివలింగమని హిందువులు అంటుండగా, అది ఫౌంటెన్ అని మసీదు మేనేజ్మెంట్ కమిటీ వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో దాని వయస్సును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వే జరపాలని అలహాబాద్ హైకోర్టు మే 12న ఏఎస్ఐను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.