జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ల మద్దతుదారులు గురువారం గొడవ పడ్డారు. అజ్మీర్‌లో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభలో ఎవరెక్కడ కూర్చోవాలన్న అంశంపై ప్రారంభమైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. ఇరు వర్గాలు పోటాపోటీగా తమ నాయకులకు మద్దతుగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతూ సచిన్ పైలట్ జన్ సంఘర్ష్ యాత్ర చేస్తున్నారు.