బెంగళూరు, ఫిబ్రవరి 5: కర్ణాటకలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘సమానత్వాన్ని, సమగ్రతను, శాంతి భద్రతలకు భంగం కలిగించే దుస్తులను ధరించి బడులకు హాజరు కావద్దు’ అని ఆదేశించింది. కర్ణాటకలో నెల రోజులుగా హిజాబ్ అంశం రాష్ర్టాన్ని కుదిపివేస్తున్నది. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించి కాలేజీలకు రావడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కాలేజీల్లో విద్యార్థులు కాషాయ కండువాల కప్పుకొని హాజరవడం, శనివారం ఉడుపి జిల్లాలో విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని జై శ్రీరాం అని నినాదాలు చేయడంతో పరిస్థితి దిగజారకుండా కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకొన్నది.