న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర పో షించిన గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టం’కు సంబంధించి మరో యూనిట్ రష్యా నుంచి భారత్కు రాబోతున్నది. దీంట్లో 4వ యూనిట్ వచ్చే నెల భారత్కు చేరనున్నట్టు భద్రతా వర్గాలు మంగళవా రం మీడియాకు తెలిపాయి. దీంతో భా రత వైమానిక దళం గగనతల రక్షణ మ రింత బలోపేతం అవుతుందని పేర్కొన్నాయి. ఎస్-400 సిస్టం రష్యా త యారుచేసిన అధునాతన, దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ.
ఇది 400 కిలోమీటర్ల పరిధిలో శత్రుదేశాల యుద్ధ విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షి పణులను గు ర్తించి గగనతలంలోనే ధ్వంసం చేయగలదు. వీటి కొనుగోలు కోసం భారత్-రష్యా మధ్య 2018లో 5 బిలియన్ డా లర్ల ఒప్పందం కుదిరింది. దీంట్లో మూ డు యూనిట్లు రష్యా ఇప్పటికే అందజేయగా, నాలుగో యూనిట్ మే నెలలో, 5వది నవంబర్లో భారత్కు అందను న్నది. ఆపరేషన్ సింధూర్లో వీటి సా మర్థ్యం చూశాక, మరో ఐదు ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు భారత్ గత నెలలో ఆమోదం తెలిపింది.