అమరావతి : సరిహద్దు దాటారనే ఆరోపణలతో గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్ జైలులో ఉన్న ఏపీ మత్స్యకారులు ( AP Fishermens) విడుదలై సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. గత అక్టోబర్‌లో తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లి బంగ్లాదేశ్ సరిహద్దు దాటారు. దీంతో అక్కడి నేవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి బాగర్హాట్ జైలుకు పంపారు.
బాధిత కుటుంబ సభ్యుల వినతుల మేరకు భారత దౌత్య అధికారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదిపులు జరిపారు. ఎట్టకేలాగు ఇరుదేశాల అధికారుల సంప్రదింపుల అనంతరం ఇండియన్ కోస్ట్‌గార్డ్ పర్యవేక్షణలో మత్స్యకారులను విశాఖకు తరలించి స్థానిక పోలీసులకు అప్పగించారు. బంగ్లా బందీలో మత్స్యకారులను విడిపించినందుకు భారత ప్రభుత్వానికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.