న్యూఢిల్లీ, మార్చి 1: ఢిల్లీలో ఇటీవల బైక్ టాక్సీలపై విధించిన నిషేధాన్ని కారణంగా చూపుతూ తమ డెలివరీ బాయ్స్ బైక్‌లకు జరిమానా విధిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు స్విగ్గీ, జొమాటో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఇటీవల ఢిల్లీలో బైక్ టాక్సీలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకొని తమ డెలివరీ బాయ్‌ల బైక్‌లకు కూడా జరిమానా విధిస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సంస్థలు కోరాయి.