కరోనా సమాచారం.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు వార్నింగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ప్రశ్నించింది. ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకు? ఇందులో హేతుబద్ధత ఏంటి అని శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం.
వ్యాక్సిన్ ధరల అంశం అనేది చాలా తీవ్రమైనది. కేంద్రానికి వచ్చిన వ్యాక్సిన్లలో 50 శాతం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, 45 ఏళ్ల పైబడిన వాళ్లకు ఇస్తామన్నారు. మిగతా 50 శాతం రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. 59.46 కోట్ల మంది భారతీయులు 45 ఏళ్ల లోపు వాళ్లే. వీళ్లలో చాలా మంది నిరుపేద, అణగారిన వర్గాలే. వాళ్లు వ్యాక్సిన్లకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది.
18-44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయో మాకు తెలుసు. మీరు ఉత్పత్తిని పెంచేలా చూడాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు వార్నింగ్
ఇక రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఎవరైనా హాస్పిటల్ బెడ్ లేదా ఆక్సిజన్ కోసం అప్పీల్ చేసినప్పుడు వారిని వేధించినట్లు తెలిస్తే దానిని కోర్టు ధిక్కరణ కిందే పరిగణిస్తాం. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు, డీజీపీలకు వెళ్లాల్సిందే. ఏ సమాచారాన్ని రాష్ట్రాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. ప్రస్తుతం మన జాతీయ సంక్షోభంలో ఉన్నాము అని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

