Pethkar family | వివాహ కానుకగా 3,500 మందికి బీమా.. ఓ జంట వినూత్న నిర్ణయం
మహారాష్ట్రలోని కందార్ తాలూకా బహదూర్‌పురా గ్రామానికి చెందిన ‘పేఠ్కర్' కుటుంబం’ తమ ఇంట జరిగే పెండ్లి వేడుకను వినూత్నంగా జరుపుకొన్నారు.
ముంబై, మే 21 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని కందార్ తాలూకా బహదూర్‌పురా గ్రామానికి చెందిన ‘పేఠ్కర్’ కుటుంబం’ తమ ఇంట జరిగే పెండ్లి వేడుకను వినూత్నంగా జరుపుకొన్నారు. వివాహ కానుకగా.. తమ గ్రామంలోని 3,500మందికి ప్రమాద బీమా చేయించింది. బీమా మొత్తాన్ని వరుడు సిద్ధేశ్వర్, వధువు మంజూషలు చెల్లించటం వార్తల్లో నిలిచింది. భవిష్యత్తులో ఏదైనా దురదృష్టకర ఘటన జరిగినప్పుడు గ్రామస్తులకు ఆర్థిక భరోసా కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశం.
‘వ్యవసాయం చేస్తుండగా పాముకాటుకు గురవడం, అడవి జంతువుల దాడికి గురికావడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటనలను చూసి మా అన్న వీళ్లకు ఏదైనా చేయాలని భావించాడు. ‘పేఠ్కర్’ కుటుంబం తరపున మేం గ్రామం మొత్తానికి బీమా చేయించాం’ అని పెండ్లికొడుకు అన్నారు. ఈ బీమా ద్వారా ప్రతి ఒకరికీ సుమారు రూ. ఒక లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందని వరుడి సోదరుడు అనూప్ పేఠర్ తెలిపారు. గత సంవత్సరం తన పెండ్లి సమయంలో హెల్మెట్ శిబిరాన్ని నిర్వహించినట్టు చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

