Student Suicides | న్యూఢిల్లీ: పలు కారణాలతో దేశంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నది. జనాభా పెరుగుదల రేటు, దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల రేటును కూడా ఇది దాటేస్తున్నదని జాతీయ నేర గణాంకాల సంస్థ డాటా ఆధారంగా ఐసీ3 ఇన్స్టిట్యూట్ బుధవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఏడాదికి దేశంలో మొత్తం బలవన్మరణాలు 2 శాతం పెరగ్గా, విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా 4 శాతం మేర పెరిగాయి. నమోదు కాని విద్యార్థుల ఆత్మహత్యలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది.
1.మహారాష్ట్ర,
2.తమిళనాడు
3.మధ్యప్రదేశ్
(ఈ 3 రాష్ర్టాల్లోనే 1/3 వంతు)
l దక్షిణాది రాష్ర్టాలు, యూటీల్లో కలిపి-29%