అపస్మారక స్థితిలో చెత్త కుండీలో దొరికిన పసికందు.. 11 రోజుల చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
Newborn girl | ఈ నెల 8న అపస్మారక స్థితిలో చెత్తకుండీలో దొరికిన పసికందుకు ప్రాణాపాయం తప్పింది. పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ చిన్నారి
న్యూఢిల్లీ: ఈ నెల 8న అపస్మారక స్థితిలో చెత్తకుండీలో దొరికిన పసికందుకు ప్రాణాపాయం తప్పింది. పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలో ఢిల్లీ శిశు సంక్షేమ మండలి ప్రతినిధులకు ఆమెను అప్పగించారు.
ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ఏరియాలోగల ఓ చెత్తకుండీలో రెండు రోజుల పసికందు ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి కాలుకు కుక్క కరిచిన గాట్లు ఉండటం, ఒళ్లంతా చల్లబడిపోయి ఉండటం, పుట్టు కామెర్లవల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, బరువు తక్కువగా ఉండటం చూసి పోలీసులు ఆ చిన్నారిని స్థానికంగా ఉండే ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు.
చిన్నారిని అడ్మిట్ చేసుకున్న వైద్యులు 11 రోజులుగా చికిత్స అందించారు. అడ్మిట్ అయినప్పుడు 2.1 కిలోలు ఉన్న బరువు ఇప్పుడు 2.5 కిలోలకు చేరింది. కామెర్లు తగ్గిపోయాయి. శ్వాస సాధారణ స్థాయికి చేరుకుంది. గాయం మానుతుంది. దాంతో వైద్యులు ఆ చిన్నారిని డిశ్చార్జి చేశారు. ఢిల్లీ శిశు సంక్షేమ మండలి ప్రతినిధులు ఆ చిన్నారిని తీసుకెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

