న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు(హైకర్స్) సరదాగా చేపట్టిన విహారయాత్ర అనూహ్య మలుపు తీసుకుంది. ఎక్కడో పర్వతాల్లో తిరుగుతుండగా…ఇద్దరు హైకర్స్ (కాలి నడకన దేశవిదేశాలు తిరిగేవాళ్లు)కు జాక్పాట్ తగిలింది. అనుకోకుండా వారిద్దరికి రూ.2.87 కోట్ల నిధి దొరికింది. ఈ ఆసక్తికర ఘటన చెక్ రిపబ్లిక్లో కొద్ది నెలల క్రితం చోటుచేసుకుంది. ఆ దేశంలోని మ్యూజియం(మ్యూజియం ఆఫ్ ఈస్ట్ బొహేమియా) అధికారులు తాజాగా ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి వెల్లడించారు.
ఆ దేశ చట్టాల్ని అనుసరించి దొరికిన నిధిలో హైకర్స్కు 10 శాతం వాటా అందుతుందని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొన్నది. చెక్ రిపబ్లిక్లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్క్క్రోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని వారికి అనిపించింది. అక్కడ కొంతమేరకు భూమిని తవ్వి తీయగా..నిధి కనిపించింది.