ఆగ్రా అనగానే అందరికీ తాజ్మహల్ గుర్తొస్తుంది. కానీ, చాలామందికి తెలియని మరో అద్భుత నిర్మాణం తాజ్మహాల్కు 12 కి.మీ. దూరంలోనే ఉంది. ఇదే స్వామి బాగ్. రాధాస్వామి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రారంభించిన శివ్ దయాల్ సింగ్ స్మృతిగా దీన్ని నిర్మించారు. నిర్మాణానికి దాదాపు 106 ఏండ్లు పట్టింది. 1904లో నిర్మాణ పనులు ప్రారంభమై కొన్ని రోజులకే ఆగిపోయాయి. 1922లో మళ్లీ ప్రారంభమై ఇప్పుడు నిర్మాణం పూర్తయ్యింది. రాజస్థాన్లోని మక్రానా నుంచి తెప్పించిన పాలరాయితో దీన్ని నిర్మించారు.