మరో పరీక్ష పేపర్ లీక్..!
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మరువక ముందే రాజస్థాన్‌లో పారా మెడికల్ పేపర్‌లీక్ కావడం సంచలనంగా మారింది. ఎగ్జామ్‌కు ముందే పేపర్ బయటకు వచ్చింది. కొందరు అధికారులు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డారు.
- రాజస్థాన్‌లో పారా మెడికల్ ప్రశ్నపత్రం బయటకు
- రూ.5.5 లక్షలిస్తే పాస్ చేయిస్తామని స్టూడెంట్లతో పేపర్ లీక్ ముఠా బేరాలు
జైపూర్ : దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మరువక ముందే రాజస్థాన్‌లో పారా మెడికల్ పేపర్‌లీక్ కావడం సంచలనంగా మారింది. ఎగ్జామ్‌కు ముందే పేపర్ బయటకు వచ్చింది. కొందరు అధికారులు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఓ ఎగ్జామ్ సెంటర్లో 45 మంది స్టూడెంట్లను రూ.5.5లక్షలకు పాస్ చేయించేందుకు సదరు ముఠా ప్లాన్ చేసినట్టు తేలింది. దీంతో కాలేజీ అధికారులతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో వాట్సాప్ చాట్స్, డైరీలు, అడ్మిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎవరెవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
టెంట్ల కింద కూర్చోబెట్టి..
మరోవైపు ప్రభాదేవి మెమోరియల్ ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా అనేక తప్పులు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు చెబుతున్న దాని ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్లకు సరైన సమయానికి ప్రశ్న పత్రాలు ఇచ్చారు. కానీ నాలుగో ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్లు పేపర్ కోసం గంటకుపైగా వేచి చూశారు. అలాగే కొందరు స్టూడెంట్లను ఎగ్జామ్ హాల్లో కాకుండా బయట టెంట్ల కింద కూర్చోబెట్టి రాయించారు. దీంతో పోలీసులు సదరు ఎగ్జామ్ సెంటర్లోనూ విచారణ జరపనున్నారు. జూన్ 29న కొందరు స్టూడెంట్ల నుంచి పేపర్‌లీక్ ముఠా ఎగ్జామ్‌లో పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం ప్రకారం జైపూర్ పోలీసులు రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

