న్యూఢిల్లీ : సైబర్, డిజిటల్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు నేషనల్ కెడెట్ కోర్ (ఎన్సీసీ) రంగంలోకి దిగింది. ఎన్సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ తెలిపిన వివరాల ప్రకారం, సైబర్ నేరాలను అరికట్టేందుకు 10 వేల మంది ఎన్సీసీ కెడెట్లతో సైబర్ వారియర్స్‌ను రంగంలోకి దించబోతున్నారు. వీరిని నేషనల్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. అదే విధంగా ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పందించేందుకు 1 లక్ష మంది కెడెట్లకు యువ ఆపద మిత్రలుగా శిక్షణ ఇవ్వబోతున్నారు. వీరిని నేషనల్ డాటాబేస్‌తో అనుసంధానం చేసి, విపత్తు సంభవించినపుడు వారి సేవలను వినియోగించుకోనున్నారు.