Murder | సూరత్, జూలై 3: సినిమాలు చూసి ప్రేరణ పొందిన నయన మండవి అనే మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే హత్య చేసింది. సూరత్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
మొదటి భర్తకు విడాకులిచ్చిన నయన తన సహ కూలీ సంజూని పెండ్లి చేసుకునేందుకు రెండేండ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని హత్య చేసింది. జూన్ 27న తన కుమారుడు కిడ్నాప్ అయ్యాడని కేసు పెట్టింది. పోలీసులు విచారణ జరపగా తల్లే ఎలివేటర్ షాఫ్ట్‌లో కొడుకు మృతదేహాన్ని పడేసి తప్పించుకోవాలని చూసినట్టు తెలిసింది.