న్యూఢిల్లీ : అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థకు మారిషస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మారిషస్‌కు చెందిన ఎమర్జింగ్ ఇండియా ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఈఐఎఫ్ఎం) సంస్థ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ లైసెన్స్‌లను మారిషస్ ఫైనాన్షియల్ సర్వీస్ మిషన్ (ఎఫ్ఎస్సీ) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
లైసెన్సుల రద్దు కారణంగా ఈ కంపెనీ తన వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు వీలు పడదు. దీనిపై స్పందించేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు నిరాకరించారు.2022 మేలో ఈ నిర్ణయం తీసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది. హిండెన్‌బర్గ్ రిపోర్టు బహిర్గతం చేయకముందే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తున్నది.