న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ధనికులకు అనుకూలంగా ఉందని, ప్రజలకు, సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉందని వామపక్షాలు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2025-26 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కీలకమైన వ్యవసాయ, ఆరోగ్య, విద్య, గృహ పథకాలకు ఈసారి కేటాయింపులు తగ్గాయని సీపీఎం విమర్శించింది.
పంటల బీమా పథకం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాలు, ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి పథకాలకు నిధుల్లో కోత విధించారని దుయ్యబట్టింది. సీపీఐ ఎంపీ సందోశ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు సామాన్యుల సంపదను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.