బెంగళూరు: చారిత్రక గ్రామం లక్కుండి ప్రాంతంలో నిధుల కోసం అన్వేషించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక, పురావస్తు శాఖలతోపాటు లక్కుండి హెరిటేజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. గతంలో రాష్ట్రకూటులు, చాళుక్యులు వంటి సుప్రసిద్ధ రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయని అధికారులు చెప్పారు. ఇటీవల లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం పునాదులను తవ్వుతుండగా బంగారు నగలతో కూడిన తామ్రపు చెంబు బయటపడింది.