న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న రష్యా సైన్యంలో 44 మంది భారతీయులు పని చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ‘వీలైనంత త్వరగా సైన్యం నుంచి భారతీయులను విడుదల చేయాలని రష్యా అధికారులను కోరాం.
ప్రాణాంతకమైన, ప్రమాదకరమైన ఇలాంటి సైనిక ఉద్యోగాల్లో చేరొద్దని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు.