థాణె: వివాహం నిశ్చయం కావడంతో తన బిడ్డ ఇక సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతుందనుకున్న వేళ విమాన ప్రమాదం ఆ ఇంట తీరని విషాదం నింపింది. మహారాష్ట్రలోని థాణె జిల్లా డోంబివిలి పట్టణంలోని రాజాజీ రోడ్డులో నివసించే రోషిణి సొంగారే(26) అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిరిండియా విమానంలో సహాయకురాలిగా పనిచేస్తున్నది. తండ్రి రాజేంద్ర, తల్లి శోభ, సోదరుడు విఘ్నేశ్ ఉన్నారు. ఇటీవలే ఆమె వివాహం మర్చెంట్ నేవీ ఆఫీసర్‌తో నిశ్చయమైంది.
నవంబర్‌లో నిశ్చితార్థం, మార్చిలో పెండ్లిని కుటుంబసభ్యులు ఖాయం చేసుకున్నారు. లండన్ వెళ్లేందుకు మూడు రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లి విధుల్లో చేరింది. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తమ కూతురు బతికే ఉంటుందనే ఆశతో కుటుంబసభ్యులు అహ్మదాబాద్ చేరుకున్నారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా కూడా రోషిణి ప్రతిభ చూపుతున్నది.