Precautionary Dose: రెండవ డోసు.. బూస్టర్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ? క్లారిటీ ఇచ్చిన కోవిన్ చీఫ్

న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకునే వాళ్లు.. ముందు నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కోవిన్ పోర్టల్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఇవాళ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. బూస్టర్ డోసు గురించి ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు. మూడవ డోసు తీసుకోవాలనుకునే వారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆయన చెప్పారు. బూస్టర్ టీకా డోసు తీసుకోవాలనుకునే వాళ్లు 60 ఏళ్లు దాటి ఉండాలి. ఏదైనా అనారోగ్యం లేదా దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవాళ్లు మూడవ డోసుకు అర్హులు. అయితే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వాళ్లుఉ తీసుకుని ఉండాలి. అంతే కాదు, రెండవ డోసు తీసుకున్న తేదీకి.. మూడవ డోసుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీకి కనీసం 9 నెలల వ్యవధి ఉండాలని డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. రెండవ డోసుకు, మూడవ డోసుకు మధ్య 39 వారాల గ్యాప్ ఉంటేనే ఆ డోసుకు అర్హులని ఆయన తెలిపారు. ప్రికాషన్ డోసు రిజిస్టర్ చేసుకుంటున్న సమయంలో.. కోమార్బిడిటీస్ ఉన్నాయా లేదా అని కోవిన్ అడుగుతుందని, ఒకవేళ మీరు అవుని అని అంటే, అప్పుడు వ్యాక్సిన్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. అయితే వ్యాక్సినేషన్ సెంటర్లో మాత్రం కోమార్బిడిటీస్ సర్టిఫికేట్ను చూపించాల్సి ఉంటుందని డాకర్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. సర్టిఫికేట్ చూపిస్తేనే టీకాలు వేస్తారన్నారు. ఇండియాలో వచ్చే నెల పదవ తేదీ నుంచి మూడవ డోసును ఇవ్వనున్నారు. మూడవ డోసు కోసం మిక్సింగ్ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో.. ఆ టీకాలను ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇండియాలో కోవీషీల్డ్, కోవాగ్సిన్ టీకాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు.. బూస్టర్గా అదే టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

