ప్రయాణికులను మోసుకెళ్లగలిగే డ్రోన్‌ను మహారాష్ట్రలోని పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ డ్రోన్‌కు వరుణ అని పేరు పెట్టారు. భారత నావికా దళం కోసం తయారుచేసిన ఈ డ్రోన్ 130 కేజీల వరకు బరువును మోయగలదు.
ఆ బరువుతో ఏకంగా 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్నది. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ కంపెనీ ఈ డ్రోన్‌ను తయారుచేసింది. గాల్లో ఉండగా ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడినా.. వాతావరణం బాగోలేకపోయినా కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఆటోమేటిక్‌గా పారాచూట్ తెరుకుంటుంది.
మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రదేశాలు, ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల నుంచి వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇవి దోహదపడుతాయని సంస్థ వ్యవస్థాపకుడు బబ్బర్ తెలిపారు.