గువాహటి: అస్సాం రాజధాని గువాహటిలోని లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి ప్రకృతిని, అస్సాం సంస్కృతిని నేపథ్యంగా తీసుకుని నిర్మించిన ఈ టెర్మినల్ భవనం ఏటా 1.31 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందచేయగలదని అధికారులు తెలిపారు. నిర్వహణ, మరమ్మతులు, ప్రక్షాళన కోసం రూ.1,000 కోట్లతోసహా మొత్తం రూ.5,000 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించింది.