న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన ఓ బృందం భారత్‌తో సహా 30 దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదనే విషయం సంచలనం రేపుతున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసేందుకు టీమ్ జార్జ్ అనే బృందం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్‌ను రూపొందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ది గార్డియన్ పత్రికతోపాటు అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్షియం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. అడ్వాన్స్డ్ ఇంపాక్ట్ మీడియా సొల్యూషన్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, 30 దేశాల్లోని క్లయింట్లకు టీమ్ జార్జ్ బృందం అందజేసినట్టు తేలింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.