పాట్నా, ఆగస్టు 3: ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారన్న ఆరోపణలను నిరూపించుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను కోరింది. శనివారం మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్న తన ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా దీనిపై వివరణ ఇవ్వాలని అడిగింది.
తేజస్వి యాదవ్ తన వద్ద రెండు ఓటర్ కార్డులు ఉంచుకొని నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆదివారం ఆరోపించిన తర్వాత ఈసీ ఈ చర్యలు తీసుకొంది. తేజస్వి పేర్కొన్న ఎపిక్ కార్డు నంబర్ అధికారికంగా జారీ చేయలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ ఒరిజినల్ కార్డును, దాని వివరాలను తమకు సమర్పించాలని కోరింది.