ముంబై, మే12 (నమస్తే తెలంగాణ): తప్పుడు సమాచారంతో పొందిన ఓబీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్తో ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సులో చేరారన్న కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముజావర్ అనే విద్యార్థిని ఓబీసీ క్యాటగిరిలో 2012-13 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సులో చేరటాన్ని సవాల్ చేస్తూ ఓ డాక్టర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుపై విచారించిన డివిజన్ బెంచ్.. జనాభాతో పోల్చితే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న మనదేశంలో ఆమె వైద్య కోర్సుపై అనర్హత విధించటం సరైంది కాదని పేర్కొన్నది. జనరల్ క్యాటగిరీలో ఆమె అడ్మిషన్ పొందినట్టు చూపాలని తీర్పు చెప్పింది. ఆ మేరకు అదనంగా ఫీజు చెల్లించాలని స్పష్టంచేసింది. విద్యార్థినికి 50 వేలు జరిమానా విధించింది.