అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం వల్ల 265 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తును ప్రారంభించింది.
అహ్మదాబాద్: మేఘానీ నగర్లోని ప్రమాద స్థలాన్ని ఎన్ఐఏ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే మృత్యుంజయుడిగా బయటపడ్డారు.
మిగిలిన మృతుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారు. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ధ్రుమిత్ గాంధీ శుక్రవారం మాట్లాడుతూ, గాలింపు, సహాయ కార్యక్రమాలు ఉదయం ముగిసినట్లు తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు, పౌర విమానయాన శాఖ అధికారులకు అప్పగించామన్నారు.