న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిబంధన ఉందో.. కేరళలోని కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశంపైనా నిషేధముందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలో ప్రవేశంపై ఆంక్షల్ని కేవలం లింగబేధంతో చూడరాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
భారతదేశంలో మతపరమైన హక్కులు, స్వేచ్ఛలకు సంబంధించిన వివిధ చట్టపరమైన ప్రశ్నలను పరిశీలిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం కేంద్రం తన వాదనను వినిపించింది. శబరిమల కేసులో 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పును తుషార్ మెహతా తప్పుబట్టారు. పురుషులు ఉన్నతమైన వారని, మహిళలు తక్కువ స్థాయిలో ఉంటారనే భావనతో ఆనాడు శబరిమల తీర్పు వెలువడిందని ఆయన అన్నారు.