న్యూఢిల్లీ, నవంబర్ 27: అణు విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్ రంగానికి అనుమతినిస్తూ కేంద్రం తలుపులు బార్లా తెరిచింది. ఈ మేరకు కొత్త ఎనర్జీ పాలసీని గురువారం ప్రకటించింది. ఈ కొత్త పాలసీ ప్రకారం ఇక నుంచి ప్రైవేట్ నిర్వాహకులు దేశీయ చిన్న మాడ్యులర్ రియాక్టర్లతో పాటు నూక్లియర్ రియాక్టర్లు నిర్మించవచ్చు, నిర్వహించవచ్చు.
ఈ నిర్ణయం కారణంగా అణు విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని కేంద్రం భావిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 8,880 మెగావాట్ల అణు విద్యుత్తును మాత్రమే ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి.