న్యూఢిల్లీ: దేశం విడిచి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు సుమారు రూ.58 వేల కోట్లు ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆస్తుల స్వాధీనం, వేలం ద్వారా ఇప్పటివరకు రూ.19,187 కోట్లు రాబట్టినట్టు తెలిపింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోకసభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.