Crop Insurance | న్యూఢిల్లీ, జనవరి 1: రెండు పంట బీమా పథకాల గడువును కేంద్రం మరో ఏడాది పొడిగించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను 2025-26 సంవత్సరానికి పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.టెక్నాలజీకి ఊతం ఇచ్చేందుకు రూ. 824.77 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశమై ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పీఎంఎఫ్‌బీవై, ఆర్డబ్ల్యూ బీసీఐఎస్కు బడ్జెట్ కేలాయింపులను పెంచినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం విలేకరులకు తెలిపారు.