వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ మోత
కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై ధరల మోత మోగించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.209 పెంచేసింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50, ముంబైలో రూ.1,684 కి చేరింది.
- ఏకంగా రూ.209 పెంచిన కేంద్ర ప్రభుత్వం
- వరుసగా 4వ నెల విమాన ఇంధన ధరలు పెంపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై ధరల మోత మోగించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.209 పెంచేసింది. దీంతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,731.50, ముంబైలో రూ.1,684 కి చేరింది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. విమానాలకు ఇంధనంగా ఉపయోగించే ఏటీఎఫ్ ధరను కిలోలీటర్‌కు రూ.5,779(5.1 శాతం) పెంచింది.
ఏటీఆర్ ధరలను పెంచడం జూలై నుంచి వరుసగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ మేరకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. వాణిజ్య సిలిండర్ ధరలపెంపు వలన హోటళ్లు, రెస్టారెంట్లపై భారం పడనున్నది. ఈ ప్రభావం ధరల రూపంలో వినియోగదారులపై చూపే అవకాశం ఉన్నది. ఏటీఎఫ్ గత నాలుగు నెలల్లో మొత్తంగా దాదాపు రూ.29,391 మేర పెరిగింది. దీని వలన విమాన సంస్థల నిర్వహణ ఖర్చు కూడా దాదాపు 40 శాతం మేర పెరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

