DPDP | ఖాతాలను మూడేండ్లు వాడకుంటే యూజర్ల డాటా తొలగించాల్సిందే
యూజర్ల వ్యక్తిగత డాటా తొలగింపు, ఆన్లైన్ సేవలకు సంబంధించి కేంద్రం కీలక నిబంధనల్ని తీసుకురాబోతున్నది.
- ఆన్లైన్ వేదికలకు కేంద్రం కొత్త నిబంధనలు
DPDP | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: యూజర్ల వ్యక్తిగత డాటా తొలగింపు, ఆన్లైన్ సేవలకు సంబంధించి కేంద్రం కీలక నిబంధనల్ని తీసుకురాబోతున్నది. యూజర్ల ఖాతాలు మూడేండ్లపాటు క్రియారహితంగా (ఇనాక్టివ్) ఉంటే, యూజర్ల వ్యక్తిగత డాటాను ఆన్లైన్ వేదికలు శాశ్వతంగా తొలగించే విధంగా నిబంధనలకు రూపకల్పన చేసింది. 18 ఏండ్లలోపు వారి విషయంలోనూ తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నాకే, వారికి ఆన్లైన్ సేవలను వర్తింపజేయాలన్న నిబంధనను తీసుకువస్తున్నది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్‌లో ఈ ముసాయిదా నిబంధనలను చేర్చింది. వీటిని ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది.
డీపీడీపీ చట్టానికి ఈ ఏడాది ఆగస్టులోనే పార్లమెంట్ ఆమోదం లభించినప్పటికీ పలు క్లాజులకు అదనపు నిబంధనలు జోడించారు. సంప్రదింపుల కోసం వీటిని త్వరలోనే విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో నోటిఫై చేయనున్నారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఆన్లైన్ గేమింగ్ తదితర సంస్థలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. మరోవైపు, ఆన్లైన్ సేవలు పొందే ముందు పిల్లల వయసు ధ్రువీకరించుకోవడం తప్పనిసరి చేయనున్నది. 18 ఏండ్లలోపు వారికి.. వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్యా సంస్థలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. వయసు ఆధారంగా ఆన్లైన్ సేవలకు అనుమతి ఇవ్వటమనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

